కృష్ణా జిల్లాలో వైసీపీ నేతల కొట్లాట.. పెడనలో 144 సెక్షన్ విధించిన పోలీసులు!
- జోగి రమేశ్, ఉప్పాల రాంప్రసాద్ గ్రూపుల ఘర్షణ
- గాయపడ్డ వైసీపీ కార్యకర్తలు
- శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్న ఎస్పీ త్రిపాఠి
మచిలీపట్నం పార్లమెంట్ కన్వీనర్ వల్లభనేని బాలశౌరి కార్యాలయ ప్రారంభోత్సవానికి నిన్న జోగి రమేశ్, ఉప్పాల రాంప్రసాద్ తమ అనుచరులతో కలిసి బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో ఒకరినొకరు కవ్వించుకోవడంతో ఇరువర్గాలు పరస్పరం దాడికి దిగాయి. ఈ ఘటనలో రమేశ్ వాహనం ధ్వంసం కాగా, రాంప్రసాద్ వర్గీయులు పలువురు గాయపడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.