ఉత్కంఠను రేకెత్తిస్తోన్న 'కేజిఎఫ్' ట్రైలర్
- తెలుగులోకి కన్నడ మూవీ
- కీలక పాత్రలో రమ్యకృష్ణ
- డిసెంబర్ 21వ తేదీన విడుదల
ముంబైతో ముడిపడిన గోల్డ్ మైన్స్ మాఫియా నేపథ్యంలో సాగే కథ ఇది. ఆసక్తికరమైన సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. "నీ వెన్నంటి వేలమంది ఉన్నారనే ధైర్యం నీకుంటే ఒక యుద్ధాన్ని మాత్రమే గెలుస్తావు. అదే నువ్వు ముందున్నావని నీ వెనకున్న వేలమందికి ధైర్యం వచ్చిందంటే ఈ ప్రపంచాన్నే గెలుస్తావు"అనే డైలాగ్ బాగుంది. డిసెంబర్ 21వ తేదీన ఈ సినిమాను తెలుగులో విడుదల చేయనున్నారు.