వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలను బీజేపీ గాల్లో దీపంగా మార్చేసింది!: మంత్రి లోకేశ్
- బీజేపీ హయాంలో పీఎస్ యూలు నిర్వీర్యం
- 74 శాతం వాటాలను అమ్మేశారు
- ట్విట్టర్ లో నిప్పులు చెరిగిన లోకేశ్
ప్రభుత్వరంగ సంస్థల(పీఎస్ యూ) ను ప్రైవేటుపరం చేస్తూ వేలాది మంది ఉద్యోగుల జీవితాలను కేంద్రం గాల్లో దీపంగా మార్చేసిందని అభిప్రాయపడ్డారు. ఇంత జరుగుతున్నా ఏపీ బీజేపీ ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో స్పందించారు.
కాగా, డీసీఐఎల్ ఉండే ఈ వాటాను విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్, పారదీప్ పోర్ట్ ట్రస్ట్, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్, కండ్లా పోర్ట్ ట్రస్ట్‌కు అమ్మేందుకు ఆర్థిక వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) గతంలోనే ఆమోదం తెలిపింది.