కాంగ్రెస్ పార్టీలో అందరూ సీఎం కుర్చీకి అర్హులే.. కల్వకుంట్ల డీఎన్ఏలో అబద్ధాలు ఉన్నాయి!: జీవన్ రెడ్డి
- సీఎం కావాలనుకోవడం తప్పా?
- నేనంటే కేసీఆర్, కవితకు భయం
- సీఎం కుర్చీకి కేసీఆర్ కంటే కడియమే బెటర్
అసలు అబద్ధాలు అనేవి కల్వకుంట్ల డీఎన్ఏలోనే ఉన్నాయని ఆయన విమర్శించారు. కేసీఆర్ కంటే సీఎం పదవికి కడియం శ్రీహరే ఉత్తమమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలకు సీఎం పదవిపై ఆశ ఉండకూడదా? అని ప్రశ్నించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుతామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రజాకూటమితోనే బంగారు తెలంగాణ సాధ్యమని స్పష్టం చేశారు.