జగన్ విచారణకు సహకరించడం లేదు.. హైకోర్టుకు తెలిపిన అటార్నీ జనరల్ శ్రీనివాస్!
- జగన్ పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు
- ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం
- తదుపరి విచారణ రేపటికి వాయిదా
ఈ సందర్భంగా జగన్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. కేసును తప్పుదోవ పట్టించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీ ఆర్పీ ఠాకూర్ వ్యవహరించారని ఆరోపించారు. అయితే ఆ ఆరోపణలను ఖండించిన ఏజీ దమ్మలపాటి శ్రీనివాస్.. పోలీసుల విచారణకు జగన్ సహకరించడం లేదని తెలిపారు. పోలీసులకు సహకరించాల్సిందిగా పిటిషనర్ ను ఆదేశించాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
అక్టోబర్ 25న విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు వస్తున్న జగన్ పై శ్రీనివాసరావు అనే యువకుడు కోడి కత్తితో దాడిచేసిన సంగతి తెలిసిందే. ప్రథమ చికిత్స అనంతరం విశాఖపట్నం ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన జగన్ హైదరాబాద్ లో ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ దాడి ఘటనతో విజయనగరం జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్ర వాయిదా పడింది.