jagapathibabu: నాలోని మైనస్ పాయింట్స్ ఇవే: జగపతిబాబు

తాజాగా జగపతిబాబు .. ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. "చిరంజీవి .. బాలకృష్ణ .. నాగార్జున .. వెంకటేశ్ మీ కంటే ముందుగా కెరియర్ ను ఆరంభించి ఇంకా హీరోలుగా కొనసాగుతున్నారు. కానీ హీరోగా మీ కెరియర్ ఎక్కడ ఎందుకు ఆగిపోయింది? అనే ఆలోచన ఎప్పుడైనా చేశారా? వాళ్లలో ఉన్నదేంటి .. నాలో లేనిదేంటి? అనే దానికి మీకు ఎలాటి సమాధానం దొరికింది? అనే ప్రశ్న జగపతిబాబుకి ఎదురైంది.

అందుకు ఆయన స్పందిస్తూ .. "నేను మొదటి నుంచి కూడా ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడేవాడిని కాదు. బాగా పరిచయం వుంటే తప్ప నేను నలుగురిలో కలవలేను. అందరితో ర్యాపో లేకపోవడం వలన అవతలవాళ్లు మరిచిపోయి కూడా అవకాశాలు తగ్గుతాయి. ఇక నా డాన్స్ .. ఫైట్స్ చెప్పుకోదగినవిగా వుండకపోవడం మరో కారణం అనుకుంటాను. నేను హీరోని అనుకోవడం కంటే నటుడిని అనుకోవడానికే ఎక్కువగా ఇష్టపడతాను" అని చెప్పుకొచ్చారు.  
jagapathibabu

More Telugu News