దీపావళి రోజున విషాదం.. టపాసులు పేల్చుతుండగా నిప్పంటుకుని పలు ఇళ్లు దగ్ధం
- విజయనగరం జిల్లాలో ఘటన
- నిప్పురవ్వలు ఎగసిపడి కాలి బూడిదైన ఇళ్లు
- పండుగ రోజున విషాదం
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు మరింత విస్తరించకుండా నియంత్రించారు. లేదంటే మరిన్ని ఇళ్లు కాలి బూడిదయ్యేవి. ఇళ్లు కోల్పోయిన బాధితుల రోదనలతో ఆ ప్రాంతం విషాదంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నిలువ నీడ లేకుండా పోయిన తమను ఆదుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.