తెలంగాణలో పట్టుబడ్డ హవాలా ముఠా.. భారీగా నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు!
- హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఘటన
- రూ.7.7 కోట్ల నగదు స్వాధీనం
- రాజకీయ నేత ఇంటి సమీపంలోనే దాడి
ఈ ఘటనకు సంబంధించి నలుగురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. త్వరలోనే వీరిని కోర్టులో హాజరు పరుస్తామని వెల్లడించారు. ఈ నగదును ఎవరికోసం తీసుకొచ్చారు? ఎవరు పంపారు? అసలు ఈ నగదు బట్వాడా వెనుక ఎవరు ఉన్నారు? అనే కోణంలో విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు.
వీరిని కస్టడీకి ఇవ్వాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరతామని తెలిపారు. కాగా, ఓ రాజకీయ నేత ఇంటి సమీపంలోనే ఈ మొత్తం నగదు దొరకడంతో ఆ కోణంలోనూ దర్యాప్తును కొనసాగిస్తున్నామని వెల్లడించారు.