'ఎన్టీఆర్'లో భాగమైన అనుష్క... బీ సరోజాదేవి పాత్రలోనట!
- జనవరి 9న విడుదల కానున్న 'ఎన్టీఆర్ - కథానాయకుడు'
- బీ సరోజాదేవి పాత్రలో నటిస్తున్న అనుష్క
- ఇంకా వెల్లడికాని అధికారిక ప్రకటన
అప్పట్లో ఎన్టీఆర్, సరోజాదేవి కలిసి నటించిన ఎన్నో చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఆయా సినిమాలకు చెందిన కొన్ని విషయాలను బయోపిక్ లో చూపిస్తున్నారట. ఈ సన్నివేశాల చిత్రీకరణ పూర్తికాగానే, అనుష్క ఫస్ట్ లుక్ స్టిల్ విడుదల అవుతుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇక సరోజాదేవి పాత్రలో అనుష్క నటించే విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.