దక్షిణాదిలో రామ మందిరంలాంటి డ్రామాలు చెల్లవు.. ఈ ఫలితాలు బీజేపీకి చెంపపెట్టు: కర్ణాటక మంత్రి శివకుమార్
- దక్షిణాదిలో బీజేపీ ఎత్తుగడలు పారవు
- రామ మందిరం వంటి అంశాలు ఇక్కడ రాజకీయ అస్త్రాలు కాలేవు
- బీజేపీని ప్రజలు తిరస్కరిస్తున్నారు
రామ మందిరంలాంటి అంశాలను దక్షిణాదిలో రాజకీయ అస్త్రాలుగా మలచలేరని చెప్పారు. దక్షిణాది ప్రజలు సామాజిక, ఆర్థిక భద్రత, మెరుగైన పాలన, పారదర్శకత వంటివాటినే పట్టించుకుంటారని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల తీర్పే అంతిమమని అన్నారు. బీజేపీని ప్రజలు తిరస్కరిస్తున్నారని... 2019లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారనే దానికి ఈనాటి ఫలితాలు ఒక ఉదాహరణ అని చెప్పారు.