విజయపథంలో కాంగ్రెస్, జేడీఎస్... ఓటమి దిశగా బీజేపీ!
- బీజేపీకి షాక్ ఇస్తున్న ఉప ఎన్నికల ఫలితాలు
- జామ్ ఖండి అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ ఘన విజయం
- మరో మూడు చోట్ల కాంగ్రెస్-జేడీఎస్ కూటమి భారీ ఆధిక్యం
మరోవైపు బళ్లారి లోక్ సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఉగ్రప్ప 2,14,826 ఓట్లతో లీడింగ్ లో ఉన్నారు. మండ్య లోక్ సభ స్థానంలో జేడీఎస్ అభ్యర్థి శివరామేగౌడ 2,33,517 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రామానగర అసెంబ్లీ స్థానంలో ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య అనిత 1,05,294 ఓట్లతో లీడింగ్ లో ఉన్నారు. శివమొగ్గ లోక్ సభ స్థానంలో మాత్రం బీజేపీ అభ్యర్థి రాఘవేంద్ర 47,388 ఓట్లతో లీడింగ్ లో ఉన్నారు.