'మారి 2' నుంచి ధనుశ్ ఫస్టులుక్ వచ్చేసింది

  • గతంలో ఫ్యాన్స్ ను ఆకట్టుకున్న 'మారి'
  • సీక్వెల్ గా సిద్ధమైన 'మారి 2'
  • డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు     
మాస్ హీరోగా తమిళనాట ధనుశ్ కి మంచి క్రేజ్ వుంది. అందువలన ఆయన సినిమాల్లో మాస్ ఆడియన్స్ ను అలరించే కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి కంటెంట్ తో గతంలో వచ్చిన 'మారి' అభిమానులను ఆకట్టుకుంది. బాలాజీ మోహన్ దర్శకత్వంలో 2015లో వచ్చిన ఆ సినిమాలో కథానాయికగా కాజల్ నటించింది.

ఆ సినిమాకి సీక్వెల్ గా బాలాజీ మోహన్ దర్శకత్వంలోనే  'మారి 2' రూపొందింది. ధనుశ్ సొంత బ్యానర్ పై నిర్మించబడిన ఈ సినిమాలో సాయిపల్లవి కథానాయికగా నటించగా, వరలక్ష్మి శరత్ కుమార్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. తాజాగా ఈ సినిమా నుంచి ధనుశ్ ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. కొత్త లుక్ తో .. తనదైన స్టైల్లో యాక్షన్ కి దిగుతున్నట్టుగా ఆయన ఈ పోస్టర్లో కనిపిస్తున్నాడు. డిసెంబర్లో ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి.    
Go Back to Shorts
dhanush
sai pallavi

More Telugu News