రాహుల్ గాంధీతో భేటీ అయిన చంద్రబాబు.. ఢిల్లీలో చారిత్రక సమావేశం

  • ఒక్క గూటికి చేరిన కాంగ్రెస్, టీడీపీ
  • భేటీలో పాల్గొన్న టీడీపీ ఎంపీలు, కాంగ్రెస్ సీనియర్ నేతలు
  • సాయంత్రం 6 గంటలకు చంద్రబాబు మీడియా సమావేశం
ఉప్పు, నిప్పుగా ఉండే కాంగ్రెస్, టీడీపీలు ఎట్టకేలకు ఒక్క గూటికి చేరాయి. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. చంద్రబాబు వెంట ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల, సీఎం రమేష్, కంభంపాటి రామ్మోహన్ తదితర నేతలు ఉన్నారు.

ఈ భేటీలో రాహుల్ తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, కొప్పుల రాజు తదితరులు ఉన్నారు. పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చిస్తున్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చే దిశగా చర్చలు సాగుతున్నాయి. తెలంగాణలో సీట్ల సంపకాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. సాయంత్రం 6 గంటలకు మీడియా సమావేశంలో చంద్రబాబు అన్ని వివరాలను వెల్లడించనున్నారు.
Go Back to Shorts
Chandrababu
Rahul Gandhi
meeting
delhi

More Telugu News