కూటమి ఉంటుంది కానీ... అధినేత చంద్రబాబు కాదు: అచ్చెన్నాయుడు
- టీడీపీకి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం
- ప్రధాని పదవిపై చంద్రబాబుకు ఆసక్తి లేదు
- బీజేపీ మోసం చేసిందన్న అచ్చెన్నాయుడు
ఏపీ బాగుండాలనే నాడు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరామని, నమ్మించి మోసం చేసినందున విడిపోయామని తెలిపారు. ప్రత్యేక హోదా సహా విభజన హామీలను నెరవేరుస్తామని కాంగ్రెస్ వాగ్దానం చేసినందునే, ఆ పార్టీకి దగ్గరయ్యామని తెలిపారు. హోదా సాధన రాష్ట్ర ప్రజలందరి కోరికని, చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో పలువురు జాతీయ పార్టీల నేతలు కలసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అచ్చెన్నాయుడు తెలిపారు.