31 ఏళ్ల తర్వాత వెలువడిన హషీంపురా సామూహిక హత్యల కేసు తీర్పు.. 16 మంది పోలీసులకు జీవిత శిక్ష
- 42 మంది ముస్లింలను కాల్చి చంపిన పోలీసులు
- ట్రయల్ కోర్టు తీర్పును తోసిపుచ్చిన హైకోర్టు
- మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారన్న ధర్మాసనం
ముస్లింలపై కాల్పులు జరిపిన పోలీసులు అనంతరం వారిని పంట కాల్వలోకి తోసేశారు. జస్టిస్ ఎస్.మురళీధర్, వినోద్ గోయల్‌తో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరిస్తూ.. ఓ లక్ష్యంతోనే ఈ హత్యలకు పాల్పడినట్టు పేర్కొన్నారు. మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని ఈ దారుణానికి పాల్పడినట్టు అభిప్రాయపడ్డారు. ఈ కేసులో మరిన్ని వాదనలు వినడానికి అంగీకరించని న్యాయమూర్తులు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన బాధిత కుటుంబాలు మిఠాయిలు పంచుకున్నాయి.