ys jagan: జగన్ వాంగ్మూలం కోరుతూ ఏపీ పోలీసుల రెండో లేఖ

  • దాడి కేసు విచారణలో పోలీసుల కీలక అడుగు
  • సమయం కేటాయించాలని వినతి
  • జగన్ సమాధానం మేరకు పోలీసుల నిర్ణయం?  
ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సాఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో జరిగిన దాడి కేసు విచారణలో ఏపీ పోలీసులు కీలకమైన అడుగు వేశారు. జగన్‌ వాంగ్మూలం కోరుతూ ఆయనకు రెండోసారి లేఖ పంపించారు. వాంగ్మూలం ఇచ్చేందుకు సమయం ఇవ్వాలని లేఖలో జగన్‌ను కోరారు. అయితే జగన్ ఇచ్చే సమాధానాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలని పోలీసులు యోచిస్తున్నారు. ఇదిలావుండగా, దాడి అనంతరం వాంగ్మూలం కావాలంటూ ఏపీ పోలీసులు హైదరాబాద్ వెళ్లగా జగన్ తిరస్కరించారు. వాంగ్మూలం ఇవ్వబోరంటూ సజ్జల రామకృష్ణా రెడ్డి లిఖిత పూర్వకంగా చెప్పిన సంగతి తెలిసిందే.
ys jagan
ap police
YSRCP

More Telugu News