Congress: కాంగ్రెస్ పార్టీలో ఆశలు పెంచుతున్న అంతర్గత సర్వే.. షాకింగ్ విషయాలు వెల్లడి!

  • 35 నియోజకవర్గాల్లో బలంగా ఉన్న టీడీపీ  
  • కాంగ్రెస్ లేదా టీడీపీ నుంచి ఎవరు పోటీ చేసినా గెలుస్తారట
  • పలు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్‌పై తీవ్ర వ్యతిరేకత
తమ పార్టీ బలబలాల కోసం కాంగ్రెస్ నిర్వహించిన అంతర్గత సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడైనట్టు సమాచారం. టీడీపీ బలాబలాలను తెలుసుకునే దిశగా కూడా ఈ సర్వే సాగింది. 35 నియోజకవర్గాల్లో తెలుగుదేశం బలంగా ఉందని, కాంగ్రెస్, టీడీపీ నుంచి ఎవరు పోటీ చేసినా గెలుపు ఖాయమని ఈ సర్వేలో తేలినట్టు సమాచారం.

అయితే టీడీపీ బలంగా ఉన్న 35 స్థానాలతో పాటు మరో 25 స్థానాల్లో విజయం సాధించగలిగితే అధికారం పక్కా అని కాంగ్రెస్ వర్గాల ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల జాబితాను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అందజేశారు. ఈ సర్వే గురించి, తెలంగాణలో తాజా పరిస్థితులు తదితర విషయాలపై చర్చించే నిమిత్తమే రాహుల్ ఆదేశాల మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లినట్టు సమాచారం.
Congress
Telugudesam
Sarvey
Rahul Gandhi
Uttam kumar Reddy

More Telugu News