YSRCP: జగన్‌పై దాడిని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వైసీపీ నేతలు.. సానుకూల స్పందన

  • జాతీయ స్థాయి నేతలను కలిసిన వైసీపీ
  • జగన్‌పై దాడి, అనంతర పరిణామాల వివరణ
  • సానుకూలంగా స్పందించిన శరద్ పవార్, శరద్ యాదవ్‌
వైసీపీ అధినేత జగన్‌పై దాడి విషయాన్ని ఆ పార్టీ నేతలు జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. న్యాయం కోసం తాము చేస్తున్న పోరాటానికి మద్దతివ్వాలని జాతీయ స్థాయి నేతలను కోరారు. నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్‌ను, లోక్‌తాంత్రిక్ జనతాదళ్ పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు శరద్ యాదవ్‌ వైసీపీ నేతలు కలిశారు.

జగన్‌పై దాడి, అనంతర పరిణామాలను వారికి వివరించారు. హత్యాయత్నం కేసుపై న్యాయ విచారణ లేదా మరేదైనా సంస్థతో దర్యాప్తు చేయించాలనే తమ డిమాండ్‌కు మద్దతివ్వాలని కోరారు. దీనిపై శరద్ యాదవ్, శరద్ పవార్ సానుకూలంగా స్పందించారు.  
YSRCP
Jagan
sarad Pawar
Sarad Yadav

More Telugu News