సానియా మిర్జా-షోయబ్ మాలిక్ ఇంట శుభవార్త.. మగబిడ్డకు జన్మనిచ్చిన టెన్నిస్ స్టార్!
- ఈరోజు ఉదయం పండంటి మగబిడ్డ జననం
- శుభవార్తను అభిమానులతో పంచుకున్న షోయబ్
- శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు, శ్రేయోభిలాషులు
కాగా, షోయబ్-సానియా దంపతులకు ఈ సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు ఉదయం షోయబ్ ట్విట్టర్లో స్పందిస్తూ.. ‘ఈ శుభవార్తను మీతో పంచుకోవడం ఎంతో ఉద్వేగభరితంగా ఉంది. పిల్లాడు, నా శ్రీమతి.. ఆరోగ్యంగా ఉన్నారు. నా శ్రీమతి ఎప్పటిలాగా స్ట్రాంగ్ గా ఉంది. మీ ప్రేమ, ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు’ అని ట్వీట్ చేశాడు.
ఈ సందర్భంగా బాలీవుడ్ కొరియోగ్రాఫర్, సానియా బెస్ట్‌ఫ్రెండ్ ఫరాఖాన్ స్పందిస్తూ ‘చాలా రోజుల తర్వాత శుభవార్త విన్నాను. సానియా- షోయబ్ మాలిక్ దంపతులకు అభినందనలు. అమ్మమ్మ తాతయ్యలుగా మారిన ఆనమ్-ఇమ్రాన్ మీర్జాలకు కూడా. ఆ దేవుడు మన బుల్లి రాకుమారుడిని దీవిస్తాడు’ అని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.