అయోధ్య కేసును అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదు: సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
- అలహాబాద్ తీర్పును సవాల్ చేస్తే పలు పిటిషన్లు దాఖలు
- పిటిషన్లను విచారించిన చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం
- సార్వత్రిక ఎన్నికలకు ముందు విచారణ అనవసరమన్న గొగోయ్
ఈ పిటిషన్లను ఈరోజు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా గొగోయ్ మాట్లాడుతూ, వాస్తవానికి జనవరిలో కూడా ఈ పిటిషన్లపై విచారించాల్సిన అవసరం లేదని... సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందు దీనిపై విచారణ అనవసరమని చెప్పారు. తరుపరి విచారణను జనవరికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించి... నాలుగు నిమిషాల్లో విచారణను ముగించారు.