కారు పార్కింగ్ స్థలంలో కుప్పకూలిన హెలికాప్టర్.. ఫుట్బాల్ క్లబ్ యజమాని దుర్మరణం!
- ఫుట్బాల్ మ్యాచ్ వీక్షించి వెళ్తుండగా ప్రమాదం
- పైకి లేచిన కాసేపటికే కుప్పకూలిన వైనం
- మంటల్లో సజీవ దహనం
శనివారం జరిగిన ఫుట్బాల్ మ్యాచ్ను వీక్షించిన అనంతరం ఆయన తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. హెలికాప్టర్ పైకి లేచిన కాసేపటికే అదుపు తప్పి కూలిపోయింది. ఆ వెంటనే మంటలు చుట్టుముట్టినట్టు పేర్కొన్నారు. ఘటనకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.