పని లేని వ్యక్తులే రాజకీయాల్లోకి వస్తారా? అదే నిజమైతే మీరంతా ఏమిటి?: శివాజీ
- జడ్జి లోయాలాంటి వారికే న్యాయం జరగలేదు
- కుట్ర పూరిత రాజకీయాలు చేస్తున్న నేతలు సిగ్గు పడాలి
- నాతో పెట్టుకుంటే ప్రజలతో పెట్టుకున్నట్టే
తనకు సినిమాలు లేవంటూ కొందరు విమర్శిస్తున్నారని... తన వ్యక్తిగత జీవితం సమాజానికి అవసరం లేదని శివాజీ అన్నారు. పని లేని వ్యక్తులే రాజకీయాల్లోకి వస్తారా? అదే నిజమైతే మీరంతా ఏమిటని తనను విమర్శిస్తున్న వారిని ఉద్దేశించి ఆయన ప్రశ్నించారు. శివాజీతో పెట్టుకుంటే ప్రజలతో పెట్టుకున్నట్టే అని అన్నారు. తనకు ప్రత్యేక హోదానే అజెండా అని చెప్పారు. ఆపరేషన్ గరుడకు సంబంధించిన వివరాలను తనకు ఇచ్చిన వ్యక్తి పేరును తాను వెల్లడించలేనని ఆయన స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఏపీలో మరిన్ని దాడులు జరుగుతాయని హెచ్చరించారు.