గాయం మానిన తర్వాత జగన్ అభిమానులను కలుస్తారు.. కాస్త సమయం పడుతుంది: ధర్మాన
- జగన్ను కలిసేందుకు వేలాదిగా వస్తున్నారు
- డాక్టర్ల సలహా మేరకు విశ్రాంతి అవసరం
- మీ ప్రేమాభిమానాలను తప్పక స్వీకరిస్తారు
నేడు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘జగన్ దాడిలో గాయపడిన విషయం తెలిశాక కోట్లాదిమంది ప్రజలు, అభిమానులు, పార్టీ నాయకులు జగన్కు ఏమీ జరగనందుకు భగవంతుడికి ధన్యవాదాలు తెలిపారు. ఆయన్ను కలవడానికి హైదరాబాద్కు వేలాది మంది వస్తున్నారు. డాక్టర్ల సలహా మేరకు జగన్కు విశ్రాంతి అవసరం కనుక కొన్ని రోజుల తర్వాత ఆయన అభిమానులను కలుస్తారు. మీరు చూపిన ప్రేమాభిమానాలను ఆయన తప్పకుండా స్వీకరిస్తారు. గాయం మానడానికి ఒక వారం రోజులు పట్టొచ్చు. డాక్టర్ల సలహాను పాటిస్తున్నారు’’ అని తెలిపారు.