Chandrababu: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు కుట్రలకు తెరలేపారు: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు కుట్రలకు తెరలేపారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు కుట్రలకు కాంగ్రెస్ నేతలు సిగ్గు లేకుండా వత్తాసు పలుకుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు తమ పార్టీ నేతలు గట్టు రామచంద్రరావు, శ్రీనివాసరావు, దండే విఠల్‌తో కలిసి రాజేశ్వర్‌రెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్‌ను కలిసి ప్రతిపక్ష నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారంటూ ఫిర్యాదు చేశారు.

అనంతరం రాజేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలిచేందుకు ఏపీ డీజీపీ కార్యాలయం అడ్డాగా కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఏపీ పోలీసులను తెలంగాణకు పంపి టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. శుక్రవారం ధర్మపురిలో అనుమానాస్పద స్థితిలో కొందరు స్థానికులకు చిక్కారని.. వివరాలు చెప్పకపోవడంతో వారిని పోలీసులకు అప్పగించారని, విచారణలో వారు ఏపీ పోలీసులుగా తేలిందని రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. అసలు ఏపీ పోలీసులకు తెలంగాణలో పనేంటని ఆయన ప్రశ్నించారు. ఏపీ పోలీసుల ద్వారా డబ్బు పంపిణీకి పాల్పడుతున్నారని రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. 
Chandrababu
Palla Rajeswar Reddy
Rajath Kumar
DGP Office
AP Police

More Telugu News