Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అప్పట్లో భానుప్రియ ఇక్కడే పడిపోయింది: దర్శకుడు వంశీ

  • 'ఆలాపన ' క్లైమాక్స్ ఇక్కడే తీశాను
  • డాన్స్ చేస్తూ భానుప్రియ కిందపడాలి 
  • నాకు చెప్పకుండా ఆమె అలా చేసింది  
దర్శకుడిగా వంశీ ఎన్నో అపురూప చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. టేకింగ్ విషయంలో ఆయనను ఎవరూ అనుసరించలేకపోవడం గురించి విశేషంగా చెబుతారు. అలాంటి వంశీ తెరకెక్కించిన సినిమాలలో 'ఆలాపన' ఒకటి. అరకులోని ఒక కొండపై ఇచ్చిన ఇంటర్వ్యూలో వంశీ మాట్లాడుతూ, ఈ సినిమాను గురించి ప్రస్తావించారు.

 "అప్పట్లో 'ఆలాపన' క్లైమాక్స్ గా భానుప్రియ డాన్స్ ను ఇదే కొండపై చిత్రీకరించాము. డాన్స్ లో భాగంగా భానుప్రియ పైకి ఎగిరి మోకాళ్లపై కిందకి దూకే భంగిమ ఒకటుంది. అందువలన వైజాగ్ నుంచి మోకాళ్లకి రక్షణగా క్యాప్స్ తీసుకురమ్మని ఒక వ్యక్తిని పంపించాం. అతను రాలేదు .. లైటింగ్ పోతోంది .. నాకు కోపం వచ్చేసి అరుస్తున్నాను. మోకాళ్ల క్యాప్స్ వచ్చేశాయి .. వేసేసుకున్నాను అని నాతో చెప్పి .. భానుప్రియ ఆ షాట్ చేసేసింది. ఆ తరువాత ఆమె మోకాళ్లకి రక్తం వస్తుండటం చూసి షాక్ అయ్యాను. టైమ్ వేస్ట్ చేయకూడదని నాకు ఆమె అబద్ధం చెప్పి అలా చేసింది" అని చెప్పుకొచ్చారు.    
vamsy

More Telugu News