సీబీఐ చీఫ్ పై విచారణను రెండు వారాల్లో పూర్తి చేయండి: సుప్రీంకోర్టు
- తనను తొలగించడంపై సుప్రీంను ఆశ్రయించిన అలోక్ వర్మ
- రెండు వారాల్లోగా విచారణను పూర్తి చేయాలంటూ సీవీసీని ఆదేశించిన సుప్రీం
- తదుపరి విచారణ నవంబర్ 12కు వాయిదా
సీబీఐ డైరెక్టర్ గా తనను తప్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అలోక్ వర్మ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు ఈరోజు విచారించింది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పిటిషన్ ను విచారించింది. సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ గా నియమితులైన మన్నెం నాగేశ్వరరావు ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోరాదని సుప్రీం ఆదేశించింది.