మీరేంటి? మీ డ్రస్సులేంటి?: సీఎస్ లపై మండిపడ్డ సుప్రీంకోర్టు!
- ఓ కేసు విచారణకు హాజరైన అరుణాచల్, గోవా సీఎస్ లు
- స్లీవ్ లెస్ జాకెట్లు వేసుకుని వచ్చిన ఉన్నతాధికారులు
- చీవాట్లు పెట్టిన జస్టిస్ రంజన్ గొగొయ్
వీరిద్దరూ తమ షర్ట్ లపై స్లీవ్ లెస్ జాకెట్లు ధరించి వచ్చారు. అరుణాచల్ ప్రదేశ్ సీఎస్ ముదురు పసుపు రంగులో మెరిసిపోతున్న జాకెట్ వేసుకుని వచ్చారు. దీంతో రంజన్ గొగొయ్, ఎస్కే కౌల్, కేఎం జోసెఫ్ ల ధర్మాసనం వారి వస్త్రధారణను ఆక్షేపించింది. కోర్టు ముందుకు సీఎస్ స్థాయిలో హాజరవుతున్న వేళ హుందాగా వస్త్రాలు ధరించాలని హితవు పలికింది. వీరిద్దరూ చెప్పిందేదీ తాము వినబోమని ధర్మాసనం చెప్పడం గమనార్హం.