జగన్కు 9 కుట్లు వేశాం.. ఆయన ధైర్యంగా ఉన్నారు: వైద్యులు
- 3 నుంచి 4 సెం.మీ.ల లోతులో గాయం
- ఆరోగ్యం నిలకడగానే ఉంది
- ఎన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలో చెప్పలేం
జగన్ కండరానికి 3 నుంచి 4 సెం.మీ.ల లోతులో గాయమైందని వారు వెల్లడించారు. 9 కుట్లు వేశామని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. కత్తికి విషం ఉందో లేదో తెలుసుకునేందుకు నమూనాలను పరీక్షలకు పంపించామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతానికి జగన్ ధైర్యంగా ఉన్నారని, అయితే ఎన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడే వెల్లడించలేమన్నారు.