ముద్దుల కోసమే సినిమా తీశానా?: నటి సంజన ఆరోపణలపై మండిపడ్డ దర్శకుడు రవి శ్రీవత్స
- రవి శ్రీవత్సపై ఆరోపణలు చేసిన సంజన
- ఆమె అబద్ధాలు చెబుతోందన్న దర్శకుడు
- చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిక
దీనిపై స్పందించిన రవి శ్రీవత్స, తానేమీ ముద్దులు పెట్టేందుకు సినిమా తీయలేదని చెప్పారు. సినిమాలో చాలా మంది నటించారని అన్నారు. హిందీ చిత్రం 'మర్డర్' కు రీమేక్ ను తీస్తున్నానని చెప్పి, ఆ చిత్రం సీడీని చూడమని సంజనకు ఇచ్చానని గుర్తు చేసుకున్న ఆయన, షూటింగ్ లో ఆమెపై ఎలాంటి వేధింపులూ జరగలేదని చెప్పారు. రేపు మధ్యాహ్నంలోగా ఆమె క్షమాపణలు చెప్పకుంటే పరువు నష్టం దావా వేస్తానని అన్నారు.