Tamilnadu: తమిళనాడులో కూడా... 100 చోట్ల ఐటీ సోదాలతో కలకలం!

తమిళనాడు ఇసుక మాఫియాపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు విరుచుకుపడ్డారు. ఈ ఉదయం నుంచి ఏకకాలంలో దాదాపు 100 ప్రాంతాల్లో దాడులు ప్రారంభించారు. నాలుగు ఇసుక మైనింగ్ కంపెనీల యజమానులు, వారి బంధుమిత్రులు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. 'న్యూస్ 7' అధినేత వైకుందరాజన్, వీవీ మినరల్ కంపెనీ, మణికందన్, చంద్రసేన్, సుకుమార్ తదితరుల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయి. సముద్రపు ఇసుకను విదేశాలకు అక్రమంగా తరలిస్తున్నారన్న పక్కా సమాచారం సేకరించిన అధికారులు, ఈ దాడులు చేస్తున్నారని తెలుస్తోంది. కాగా, నేడు విశాఖలోని పలు కంపెనీలపైనా దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే.
Tamilnadu
IT Raids
Sand Mafia

More Telugu News