Nagarjuna: 'బైకర్'పై నాగార్జున ప్రశంసల వర్షం... దర్శకుడు మావాడేనంటూ ట్వీట్
శర్వానంద్ హీరోగా, సీనియర్ నటుడు రాజశేఖర్ కీలక పాత్రలో నటించిన 'బైకర్' చిత్రంపై అగ్ర నటుడు అక్కినేని నాగార్జున ప్రశంసల వర్షం కురిపించారు. ఏప్రిల్ 3న విడుదలై మంచి టాక్‌తో ప్రదర్శితమవుతున్న ఈ సినిమాను వీక్షించిన ఆయన, తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
"కుటుంబ భావోద్వేగాలు, బంధాలను 'బైకర్' చిత్రం చాలా అందంగా సెలబ్రేట్ చేసింది. ముఖ్యంగా రేసింగ్ సన్నివేశాలు, క్లైమాక్స్ తప్పక చూడాలి. సాంకేతికంగా సినిమా ఎంతో ఉన్నతంగా ఉంది" అని నాగార్జున పేర్కొన్నారు.
ఈ చిత్ర దర్శకుడు అభిలాష్ రెడ్డి కంకరపై నాగార్జున ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. "అభిలాష్ మా అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా విద్యార్థి కావడం నాకు చాలా గర్వంగా ఉంది. ఇంత పరిణతితో ఈ కథను తెరకెక్కించినందుకు దర్శకుడికి, చిత్ర బృందానికి నా అభినందనలు" అని తెలిపారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి స్టార్ హీరో నుంచి ప్రశంసలు దక్కడంతో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది.