హిజ్రాతో సహజీవనం... నరకం చూపించిన వైనం!
- గత రెండేళ్లుగా రాధికతో సురేష్ సహజీవనం
- బైక్ కోసం చిట్టీ డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి
- అంగీకరించకపోవడంతో కత్తితో దాడి
ఈ క్రమంలో డబ్బిచ్చేందుకు ఆమె అంగీకరించకపోవడంతో, వాగ్వాదానికి దిగి, కత్తితో గొంతు కోశాడు. దీంతో రాధిక కేకలు వేయగా, చుట్టుపక్కల వారు వచ్చి ఆమెను ఆసుపత్రికి తరలించారు. గతంలోనూ రాధికను సురేష్ పలుమార్లు హింసించాడని తెలుస్తోంది. వారిద్దరి మధ్యా సయోధ్యను కుదర్చాలని ఇతర హిజ్రాలు ప్రయత్నించారు కూడా. తమకు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు మహబూబాబాద్ సీఐ రవికుమార్ వెల్లడించారు. డబ్బు కోసం దారుణానికి తెగబడిన సురేష్ ను కఠినంగా శిక్షించాలని హిజ్రాలు డిమాండ్ చేశారు.