arjun: హీరో అర్జున్ పై మరో నటి లైంగిక ఆరోపణలు!

  • వేరే యువతిని గదిలోకి పంపమని నాతో చెప్పారు
  • డబ్బు ఇచ్చి అమ్మాయిలను తెప్పించుకునేవారు
  • అర్జున్ పై రెండో మహిళ లైంగిక ఆరోపణలు
ప్రముఖ సినీ నటుడు అర్జున్ పై మరో నటి లైంగిక ఆరోపణలు చేయడం సంచలనం రేపుతోంది. ఒక సినిమా షూటింగ్ సందర్భంగా వేరే యువతిని తన గదిలోకి తీసుకురమ్మని తనతో అర్జున్ చెప్పారని ఆమె తెలిపింది. ఆర్టిస్టులను సప్లయ్ చేసే వ్యక్తికి కూడా డబ్బు ఇచ్చి అమ్మాయిలను తెప్పించుకునేవారని చెప్పింది. ఓ టీవీకి ఇచ్చిన భేటీలో ఆమె ఈ వివరాలను వెల్లడించింది.

మరోవైపు, హీరోయిన్ శృతి హరిహరన్ ఇప్పటికే అర్జున్ పై ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఓ సినిమా షూటింగ్ సందర్భంగా, తన వీపుపై చేయి వేసి, తనను గట్టిగా హత్తుకున్నారని ఆమె ఆరోపించింది. ఈ నేపథ్యంలో, అర్జున్ అభిమానుల నుంచి ఆమెకు బెదిరింపు ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి.
arjun
tollywood
kollywood
sexual harrassment
metoo

More Telugu News