శబరిమలలోకి మహిళల ప్రవేశం.. పిటిషన్లను విచారించేందుకు అంగీకరించిన సుప్రీంకోర్టు
- 19 పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయన్న చీఫ్ జస్టిస్
- ఎప్పుడు విచారిస్తామనే విషయాన్ని రేపు వెల్లడిస్తామన్న గొగోయ్
- సుప్రీం తీర్పుతో రణరంగాన్ని తలపించిన శబరిమల పరిసర ప్రాంతాలు
అయితే, పిటిషన్లను ఎప్పుడు విచారిస్తామనే విషయాన్ని రేపు వెల్లడిస్తామని తెలిపింది. ఈ అంశంపై 19 పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయని చీఫ్ జస్టిస్ గొగోయ్ తెలిపారు. మరోవైపు, సుప్రీం తీర్పుతో పలువురు మహిళలు ఆలయంలోకి వెళ్లేందుకు యత్నించారు. ఈ నేపథ్యంలో, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. శబరిమల పరిసర ప్రాంతాలు రణరంగాన్ని తలపించాయి.