చార్మినార్ కి వస్తున్న రాహుల్ గాంధీకి స్వాగతం: అసదుద్దీన్ ఒవైసీ
- రాహుల్, అమిత్ షా హైదరాబాద్ నుంచి పోటీ చేయాలి
- మిత్రులైనా, శత్రువులైనా హైదరాబాద్ ఆహ్వానం పలుకుతుంది
- మోదీకి శివసేన భయపడుతోంది
ప్రధాని మోదీకి శివసేన భయపడుతోందని ఒవైసీ విమర్శించారు. వారి పిరికితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి వారి సామ్నా పత్రికలో సంపాదకీయాలు రాసుకుంటోందని ఎద్దేవా చేశారు. కథనాలను రాసుకోవడం ఆపేయాలని శివసేనకు సూచిస్తున్నానని... మోదీని, మహారాష్ట్రలోని ఫడ్నవిస్ ప్రభుత్వాన్ని వదిలేయాని అన్నారు. తన పూర్వీకులు భారతదేశానికి చెందినవారే అనే విషయాన్ని నిరూపిస్తానని చెప్పారు.