ఏడు సార్లు రిపోర్టులు ఇచ్చినా కడప స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయలేదు!: సుజనా చౌదరి ఆవేదన
- టీడీపీ నేతలు లక్ష్యంగా ఐటీ దాడులు
- 48 గంటల్లో మరోసారి నివేదిక ఇస్తాం
- ఐటీ దాడులకు భయపడబోం
ఐటీ అధికారులు వస్తుంటారు, పోతుంటారనీ, వాళ్లు తమనేం చేయలేరని సుజనా చౌదరి స్పష్టం చేశారు. 3 మిలియన్ టన్నుల ఉత్పాదక ఉక్కు కర్మాగారం నిర్మించేందుకు కావాల్సిన సమగ్ర ప్రతిపాదనలను కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే ఇచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్ కు సాయం చేయడం ఇష్టం లేని కేంద్రం కుంటిసాకులు చెబుతోందని దుయ్యబట్టారు.
ఎన్టీయే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చినప్పటి నుంచీ కేంద్రం చేస్తోందని ఆరోపించారు. ఉక్కు కర్మాగారానికి సంబంధించి ఏడుసార్లు సమగ్ర వివరాలు అందించామన్నారు. 48 గంటల్లో మరోసారి కడప స్టీల్ ఫ్యాక్టరీ ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర వివరాలు అందజేస్తామన్నారు. ఇప్పటికైనా కేంద్రం కక్ష సాధింపు చర్యలను మానుకుని స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ విషయంలోనూ కేంద్రం తీరు ఏమాత్రం మారలేదని దుయ్యబట్టారు.