సీపీఎం తెలంగాణ నేత యాదయ్య గుండెపోటుతో మృతి
- రెండున్నర దశాబ్దాలుగా పార్టీకి సేవలు
- మూడేళ్లపాటు మండల సహకార సంఘం డైరెక్టర్‌గా బాధ్యతలు
- యాదయ్యకు పలువురు నేతల నివాళి
ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు, మస్కు నర్సింహులుతోపాటు సీపీఎం నాయకులు పి.జంగారెడ్డి, బి.మధుసూదన్‌రెడ్డి, పి.యాదయ్యయాదవ్, సీపీఎం మండల కార్యదర్శి పి.బ్రహ్మయ్య, పి.అంజయ్య తదితరులు యాదయ్య మృతదేహంపై పూలమాలలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. యాదయ్య మూడేళ్లపాటు మండల సహకార సంఘం డైరెక్టర్‌గా పనిచేసి రైతు సమస్యలపై రాజీలేని పోరాటం చేశారు.