సహజీవనం చేస్తున్న మహిళను వదిలించుకునే ప్రయత్నం.. హత్యకు కుట్ర!
- భర్త నుంచి విడిపోయిన మహిళ
- మరో వ్యక్తితో సహజీవనం
- మహిళపై దాడి.. తప్పించుకున్న బాధితురాలు
ఈ క్రమంలో ఆమెకు అప్పటికే వివాహమైన అంజయ్య అనే వ్యక్తితో పరిచయం కావడంతో ఇద్దరూ కలిసి జీవనోపాధి కోసం ఘట్కేసర్ మండలంలోని అన్నోజిగూడకు వెళ్లి అక్కడే ఉంటున్నారు. అయితే, ఇటీవల వీరిమధ్య కూడా గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో లక్ష్మిని వదిలించుకోవాలని ప్లాన్ వేసిన అంజయ్య ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. గురువారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో సమీపంలోని ఇటుకుల బట్టీ వద్దకు తీసుకెళ్లి దాడిచేశాడు. అతడి దాడి నుంచి తప్పించుకున్న లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంజయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.