sushanth singh rajput: బాలీవుడ్ హీరోయిన్ సంజనను లైంగికంగా వేధించాడన్న ఆరోపణలపై హీరో సుశాంత్ స్పందన
- 'కిజీ ఔర్ మ్యానీ' చిత్రంలో నటించిన సుశాంత్, సంజన
- సెట్లో అసభ్యకరంగా ప్రవర్తించాడని వార్తలు
- సంజనతో మెసేజ్ స్క్రీన్ షాట్లను పంపిన సుశాంత్
మీటూ ఉద్యమం నేపథ్యంలో హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పేరు బయటకు రావడం బాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. 'కిజీ ఔర్ మ్యానీ' అనే చిత్రంలో సుశాంత్ నటిస్తున్నాడు. ఇతని సరసన సంజన హీరోయిన్ గా నటిస్తోంది. సెట్స్ లో ఆమె పట్ల సుశాంత్ అసభ్యకరంగా ప్రవర్తించాడనే వార్తలు వచ్చాయి. దీనిపై సుశాంత్ స్పందిస్తూ, సెట్లో ఏం జరిగిందో వివరిస్తూ, సంజనకు తాను పంపిన మెసేజ్ ల స్క్రీన్ షాట్లను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.
మీటూ ఉద్యమాన్ని కొందరు వ్యక్తిగత లాభం కోసం వాడుకుంటున్నారని సుశాంత్ మండిపడ్డాడు. కావాలనే కొందరు తనపై ఆరోపణలు చేస్తున్నారని... ఆరోపణలను ఎదుర్కోవడానికి తనకు తాను మద్దతు ఇచ్చుకోక తప్పదని తెలిపాడు. ఒకరి వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం తప్పని తెలిసినా... ఇలా చేయక తప్పడం లేదని చెప్పాడు. సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి చివరి రోజు వరకు సంజనతో జరిగిన సంభాషణ ఇదని తెలిపాడు. ఇక నిర్ణయించాల్సింది మీరేనని అభిమానులను ఉద్దేశించి అన్నాడు.