అరుదైన 'రుమాటిజం' వ్యాధితో బాధపడుతున్న యాంకర్ రష్మి!
- శరీర బరువులో హెచ్చుతగ్గులకు కారణమయ్యే 'రుమాటిజం'
- 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే తెలిసింది
- ఆహారం విషయంలో క్రమశిక్షణగా ఉంటున్నానన్న రష్మి
ఇటీవల రష్మిని ఓ ఈవెంట్ లో తాను చూశానని, చీరలో ఆమె చాలా లావుగా కనిపించిందని, శరీరాకృతి విషయంలో జాగ్రత్త వహించాలని ఓ అభిమాని సూచించడంతో, రష్మి స్పందించింది. తనకున్న వ్యాధి కారణంగానే లావు విషయంలో హెచ్చుతగ్గులు వస్తుంటాయని, తాను చిన్నప్పటి నుంచీ ఆహారపు అలవాట్ల విషయంలో క్రమశిక్షణగానే ఉంటానని చెప్పింది.
ఈ వ్యాధి నుంచి బయట పడేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్న సమయంలో దుష్పరిణామాలు వచ్చాయని చెప్పుకొచ్చింది. ఇక రష్మి వ్యాధి గురించి తెలుసుకున్న పలువురు నెటిజన్లు ఆమెకు జాగ్రత్తగా ఉండాలని సలహా ఇస్తూ, బాధను దిగమింగుకుంటోందని, ధైర్యవంతురాలని పొగిడేస్తున్నారు.