నేను కూడా లైంగిక వేధింపులను ఎదుర్కొన్నా: మంచు లక్ష్మి

  • సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదుర్కోలేదు
  • నిజ జీవితంలో ఎదుర్కొన్నా
  • 'మేము సైతం' కార్యక్రమానికి రావాలని పవన్ ను కోరాను
సినీ నటి మంచు లక్ష్మి సంచలన విషయాన్ని వెల్లడించింది. తాను కూడా లైంగిక వేధింపులను ఎదుర్కొన్నానని ఆమె తెలిపింది. అయితే సినిమా ఇండస్ట్రీలో వేధింపులను ఎదుర్కోలేదని... నిజ జీవితంలో ఎదుర్కొన్నానని చెప్పింది. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు బదులుగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది.

మరోవైపు 'మేము సైతం' అనే టీవీ కార్యక్రమాన్ని మంచు లక్ష్మి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో 'పవన్ కల్యాణ్ ను ఈ కార్యక్రమానికి తీసుకురావచ్చు కదా?' అని ఓ నెటిజన్ అడిగాడు. దీనికి సమాధానంగా... 'కార్యక్రమానికి రావాలని పవన్ కల్యాణ్ ను చాలా సార్లు అడిగాను. ఇంకా ఆయన నుంచి సమాధానం రాలేదు' అని చెప్పింది.
Go Back to Shorts
manchu lakshmi
Pawan Kalyan
sexual harrassment
tollywood

More Telugu News