Pawan Kalyan: జనసైనికులు ఈ విపత్తును ప్రపంచానికి తెలియజేయాలి: పవన్ కల్యాణ్

  • తుపానుపై కేంద్రం స్పందించకపోవడం బాధాకరం
  • ఎన్నారైలు తుపాను బాధితులను ఆదుకోవాలి
  • బాధితులకు సాయం చేయాలనే ఇక్కడకు వచ్చా
తిత్లీ తుపానుపై కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం బాధాకరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విపత్తును జనసేన కార్యకర్తలు ప్రపంచానికి తెలియజేయాలని చెప్పారు. తాను ఓట్ల కోసం ఇక్కడకు రాలేదని... తుపాను బాధితులకు సాయం చేయాలనే వచ్చానని తెలిపారు. విదేశాల్లో ఉన్న తెలుగువారు తుపాను బాధితులను ఆదుకోవాలని విన్నవించారు. ఈరోజు ఆయన తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. తుపాను బాధితులను ఓదార్చారు. తుపాను నష్ట తీవ్రతను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పైమేరకు స్పందించారు. 
Pawan Kalyan
janasena
titli

More Telugu News