Telangana: తెలంగాణలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం!: బీజేపీ నేత కిషన్ రెడ్డి

  • ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చిత్తశుద్ధిగా పోరాడాం
  • టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడతాం
  • ద్రోహులకు కేసీఆర్ పెద్దపీట వేశారు
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ నేత కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. తెలంగాణ ద్రోహులు, అవకాశవాదులతో కలవకుండానే పోటీకి దిగుతున్నామన్నారు. తెలంగాణ అమరవీరులను వదిలేసి ద్రోహులకు కేసీఆర్ పెద్దపీట వేశారని ఆరోపించారు. అసోం, త్రిపుర తరహాలో తెలంగాణలోనూ తాము అధికారంలోకి వస్తామని స్పష్టం చేశారు.

తెలంగాణ ఉద్యమంలో బీజేపీ చిత్తశుద్ధితో పోరాడిందనీ, పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు తాము ఒకే మాట మీద నిలబడ్డామని కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించినట్లుగానే, తెలంగాణ అభివృద్ధిలోనూ ముందుంటామని అన్నారు. కాంగ్రెస్‌, టీఆర్ఎస్ ప్రభుత్వాల వైఫల్యాలను గ్రామాల్లో ఎండగడతామన్నారు. తెలంగాణలో మార్పు బీజేపీతోనే సాధ్యమని.. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి ఆశించిన ఫలితాలు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Telangana
kishan reddy
BJP
TRS
KCR

More Telugu News