కాప్రాలో ఇంటిపైనే గంజాయి సాగు.. నైజీరియా యువత అరెస్టు!

  • ఓ పూలతొట్టెలో గంజాయి మొక్కలు
  • స్థానికుల సమాచారంతో పోలీసులు దాడులు
  • అదుపులో ఇద్దరు..మరో ఇద్దరు పరారు
గంజాయిని ఇతర ప్రాంతాలను నుంచి తీసుకొచ్చి విక్రయించడం కష్టమని భావించిన హైదరాబాద్ లోని నైజీరియా యువత కొత్త ఆలోచన చేసి దొరికిపోయింది. కాప్రాలోని వారు ఉండే ఇంటిపైనే గంజాయి సాగు చేపట్టారు. ఓ పూలతొట్టెలో గంజాయి మొక్కలను పెంచుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు వారి ఇంటిపై పోలీసులు దాడి చేశారు.

ఈ సందర్భంగా ఓ యువతి, యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరో ఇద్దరు పరారైనట్టు పోలీసులు తెలిపారు. చదువు పేరిట హైదరాబాద్ కు వచ్చిన నైజీరియాకు చెందిన కొందరు మత్తు మందు పదార్థాలు సరఫరా చేస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఇలాంటి పనులకు పాల్పడవద్దని ఎన్నిసార్లు హెచ్చరించినా వారిలో మార్పు రావడం లేదని, గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
Go Back to Shorts
kapra
Hyderabad
ganja
nigeria youth

More Telugu News