భర్త ఉండగానే ఇద్దరితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ.. గొంతు కోసి పరారైన ప్రియుడు!
- కర్ణాటకలోని బెళత్తూరులో ఘటన
- వీధిలో వెళుతుండగా వెంబడించి దాడి
- నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు
ఈ విషయం తెలుసుకున్న ప్రియుడు రాజశేఖర్ ఆగ్రహంతో ఊగిపోయాడు. నిన్న సాయంత్రం రోడ్డుపై వెళుతుండగా ఆమెను అడ్డగించాడు. వెంట తెచ్చుకున్న కత్తితో మంజుల కడుపులో పొడిచాడు. అనంతరం గొంతు కోసి ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని హోసూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దాడి ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.