హైదరాబాదులో భారీ వర్షం.. అలర్ట్ అయిన జీహెచ్ఎంసీ అధికారులు
- నిన్న సాయంత్రం నుంచి హైదరాబాదులో వర్షాలు
- నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు
- అధికారులంతా అందుబాటులో ఉండాలంటూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశం
పాత భవనాలను ఖాళీ చేయాలని, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. ప్రజలకు అధికారులంతా అందుబాటులో ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిశోర్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు, కుండపోత వర్షంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.