రూ. 4.5 కోట్ల విలువైన బంగారం, రూ. 2.5 కోట్ల కరెన్సీ నోట్లతో విశాఖ కన్యకా పరమేశ్వరి ధగధగలు.. వీడియో చూడండి!
- విశాఖ కురుపాం మార్కెట్ ప్రాంతంలో ఆలయం
- బంగారు చీర, ఆభరణాలతో అమ్మకు అలంకరణ
- దర్శించుకునేందుకు పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులు
మహాలక్ష్మి అలంకరణ సందర్భంగా అమ్మవారికి బంగారు చీరతో పాటు, ఇతర ఆభరణాలను అలంకరించామని అన్నారు. సుమారు 200 మంది భక్తులు అలంకరణకు అవసరమైన బంగారం, నగదు అందించారని చెప్పారు. విశాఖపట్నంలోని కురుపాం మార్కెట్ ప్రాంతంలో ఈ ఆలయం ఉండగా, అమ్మను దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.