తరగతి గదిలో విద్యార్థుల ఎదుటే ప్రిన్సిపాల్‌ను నరికి చంపిన దుండగులు!

  • విద్యార్థులకు పాఠం చెబుతుండగా ఘటన
  • మారణాయుధాలతో క్లాస్‌లోకి ప్రవేశించిన దండగులు
  • షాక్‌లో విద్యార్థులు
విద్యార్థులకు స్పెషల్ క్లాస్ చెబుతున్న ఓ ప్రిన్సిపాల్‌ను కొందరు దుండగులు అత్యంత దారుణంగా పొడిచి చంపారు. బెంగళూరులో జరిగిందీ ఘటన. తమ కళ్లముందే ప్రిన్సిపాల్‌ను చంపడంతో విద్యార్థులు వణికిపోయారు. షాక్ నుంచి ఇప్పటికీ తేరుకోలేకపోతున్నారు. నగరంలోని అగ్రహార దసహళ్లి‌లోని హవనూర్ పబ్లిక్ స్కూల్‌లో ఈ ఘటన జరిగింది. ప్రిన్సిపాల్ రంగనాథ్ (60) విద్యార్థులకు ప్రత్యేక క్లాస్ చెబుతుండగా మారణాయుధాలతో పాఠశాలలోకి ప్రవేశించిన ఆరుగురు దండగులు నరికి చంపారు. అనంతరం కారులో పరారయ్యారు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తుండగా మహాలక్ష్మి లేఅవుట్ ప్రాంతంలో ఓ నిందితుడు చిక్కాడు. అంతకుముందు పోలీసులకు-నిందితుడికి మధ్య కాల్పులు జరిగాయి. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ తూటా నిందితుడి కాలులోకి దూసుకెళ్లడంతో గాయపడ్డాడు. స్కూలు భవనం కట్టిన భూమి విషయంలో వివాదమే హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
Go Back to Shorts
Bangaluru
Murder
School
Principal
hacked to death
Students

More Telugu News