నా గెలుపుకి 'బిగ్ బాస్ 2' నిర్వాహకులు సపోర్ట్ చేశారనడం అబద్ధం: కౌశల్
- నేను విన్ అవుతానని నాకు తెలుసు
- ఎలాంటి మ్యాచ్ ఫిక్సింగ్ లేదు
- హౌస్ లో అందరూ సమానమే
'అందువల్లనే ఈ కార్యక్రమాన్ని ఫాలో అయ్యేవారికి మీరే ఈ ప్రోగ్రామ్ ను డిజైన్ చేసినట్టుగా అనిపించింది. ఇక్కడే మీకు .. ఛానల్ నిర్వాహకులకు మధ్య ఏదైనా మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా? అనే అనుమానం కూడా వాళ్లకి వచ్చింది. మీ గెలుపుకు ఛానల్ నిర్వాహకులు పరోక్షంగా సపోర్ట్ చేశారని కూడా అనుకుంటున్నారు .. ఇందులో నిజమెంత?' అనే ప్రశ్న జాఫర్ నుంచి ఎదురైంది.
అప్పుడు కౌశల్ 'అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ .. 'బిగ్ బాస్ 2'కి సెలెక్ట్ అయినట్టుగా మిగతా సభ్యులకు 45 రోజుల ముందు తెలిస్తే, నాకు ఓ 10 రోజుల ముందు మాత్రమే తెలిసింది. హౌస్ లోకి వెళ్లిన తరువాత ఇంటి సభ్యులందరినీ సమానంగానే చూశారు. ఎవరు ఎలా గేమ్ ఆడతారో నిర్వాహకులకే తెలియదు .. అలాంటప్పుడు ఎలా సపోర్ట్ చేస్తారు?' అంటూ ఖండించాడు.