కిడారి, సోమల హత్యలో పాల్గొన్న మావోయిస్టు మీనా ఎన్ కౌంటర్!

  • ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఘటన
  • నలుగురిని అదుపులోకి తీసుకున్న బలగాలు
  • విశాఖ మన్యంలో ఇద్దరిని హతమార్చిన మావోలు
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలను హత్య చేసిన ఘటనలో పాల్గొన్న మీనాను పోలీసులు ఈ రోజు ఎన్ కౌంటర్ లో హతమార్చారు. ఆంధ్రా-ఒడిశా బోర్డర్ లో ఉన్న బెజ్జింకి ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు మావోలు తారసపడ్డారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి.

ఈ సందర్భంగా మావోలను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టిన బలగాలు కాల్పులు జరపడంతో మీనా ప్రాణాలు కోల్పోయింది. చనిపోయిన మీనాను గాజర్ల రవి అలియాస్ గణేశ్ భార్యగా పోలీసులు గుర్తించారు. ఆమె స్వస్థలం వరంగల్ అని చెప్పారు. కాగా,  ఈ ఎన్ కౌంటర్ లో జయంతి, రాధిక, గీత, రాజశేఖర్ అనే మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Go Back to Shorts
Andhra Pradesh
Visakhapatnam District
kidari
soma
encounter
Odisha
security forces
Police

More Telugu News